మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు | Nampally Court Notice Issued To Minister Konda Surekha | Sakshi
Sakshi News home page

మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

Published Thu, Oct 10 2024 2:24 PM | Last Updated on Thu, Oct 10 2024 3:07 PM

Nampally Court Notice Issued To Minister Konda Surekha

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో మంత్రి  తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు.

రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని  సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, తాజాగా  స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మంత్రి కొండా సురేఖకు  నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.

కొండా సురేఖ చేసిన  వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రాజకీయ పరంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను దూషించే క్రమంలో సినీనటి సమంత విడాకులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి,  అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం అయ్యాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement