మంచు విష్ణు( Vishnu Manchu) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) నుంచి ప్రభాస్ (Prabhas) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 'రుద్ర' పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తాజా పోస్టర్‌తో మేకర్స్ తెలిపారు. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ఏప్రిల్ 25 విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రళయ కాల రుద్రుడు..! త్రికాల మార్గదర్శకుడు..!! శివాజ్ఞ పరిపాలకుడు..!!! అంటూ కన్నప్ప టీమ్ విడుదల చేసిన ప్రభాస్ రుద్ర గెటప్ అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి.
మొదట కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేయాలని ప్రభాస్‌నే కోరారు మంచు విష్ణు.., అందుకు ప్రభాస్ నిరాకరించి మరో పాత్ర ఉంటే చెప్పు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఏంటి అంటూ పెద్ద చర్చే నడిచింది. వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. రుద్రగా ప్రభాస్ కనిపిస్తారని కన్నప్ప టీమ్ ప్రకటించింది. కన్నప్పలో శివుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment