సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాలంటైన్స్ కంటే ఒకరోజు ముందే (ఫిబ్రవరి 13న) కళావతి సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
'వందో, ఒక వెయ్యో, ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే ఈ మాయ.. కమ్మ కమ్మాన్ కళావతి.. నువ్ లేకుంటే అధోగతి..' అంటూ సాగే లిరిక్స్ జనాల మెదళ్లలో నుంచి అంత ఈజీగా పోవట్లేదు. మ్యూజిక్ లవర్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ పాట తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించింది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 12న విడుదలవుతోంది.
#KalaaVathiHits150MViews 🔥
— GMB Entertainment (@GMBents) April 26, 2022
Blockbuster Magical Melody #Kalaavathi continues to allure Music Lovers ❤️
🎧 https://t.co/ItJS7k8bXF#SarkaruVaariPaata#SVPonMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @saregamasouth pic.twitter.com/jSRYVwBhvG
చదవండి 👉 పెళ్లి చేసుకోమని బెదిరింపులు, తమిళ నిర్మాత అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment