ఇషాన్ నాకు పోటీగా తయారయ్యాడు : సోనూ సూద్‌ | Sonu Sood's Got Major Fitness Competition From His Son Eshaan | Sakshi
Sakshi News home page

ఇషాన్ నాకు పోటీగా తయారయ్యాడు : సోనూసూద్‌

Published Sun, Sep 20 2020 8:49 AM | Last Updated on Sun, Sep 20 2020 11:45 AM

Sonu Sood's Got Major Fitness Competition From His Son Eshaan - Sakshi

ఢిల్లీ : బాలీవుడ్‌ సినీ నటుడు సోనూసూద్‌ కరోనా క్లిష్ట సమయంలో సామాజిక సేవ చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఎంతోమందికి తన వంతు సహాయం చేసి వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నించాడు. తాజాగా సోనూ తన కొడుకు ఇషాన్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబ్యాక్‌ ఫోటో ఒకటి షేర్‌ చేశాడు. కొడుకు ఇషాన్‌తో కలిసి బాడీ ఫిట్‌నెస్‌ చూసిస్తున్న  సోనూసూద్‌ ఆ ఫోటోలో కనిపిస్తాడు.


దీనికి క్యాప్షన్‌ జత చేస్తూ..' హ్యాపీ బర్త్‌డే.. ఇషాన్‌ సూద్‌.. మొత్తానికి బాడీ ఫిట్‌నెస్‌లో నాకు పోటీగా తయారయ్యావు. కంగ్రాట్స్‌.. అంటూ తెలిపాడు. సోనూ షేర్‌ చేసిన ఫోటో ఇషాన్‌ ఐదేళ్ల వయసున్నప్పడిది.. ఇప్పుడు ఇషాన్‌ టీనేజ్‌ వయసులోకి అడుగుపెట్టాడు. బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఇషాన్‌ తండ్రితో కలిసి సమానంగా వర్కవుట్స్‌ చేస్తూ పోటీగా తయారయ్యాడు.  అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో ఉంచాడు. తండ్రికి మించి తనయుడు అంటే ఇదేనేమో.. ఇషాన్‌ బాడీ చూస్తే.. సోనూ సూద్‌ను మించిపోయేలా ఉన్నాడు. 1996లో సోనాలిని పెళ్లి చేసుకున్న సోనూసూద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Twinning 💪 @eshaansoood

A post shared by Sonu Sood (@sonu_sood) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement