Swastika Mukherjee Shares Her Viral Images On Body Positivity - Sakshi
Sakshi News home page

Swastika Mukherjee: శరీరాకృతిపై ఆందోళన ఎందుకు.. నేనైతే

Published Wed, Aug 11 2021 12:57 PM | Last Updated on Wed, Aug 11 2021 5:32 PM

Swastika Mukherjee: New Pics Spread Body Positivity Love Thy Handles - Sakshi

Swastika Mukherjee Has Body Positivity: ‘‘అందానికి సరైన నిర్వచనం ఏదీ ఉండదు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు అందంగానే ఉంటారు. కానీ ఈ విషయాన్ని బలంగా నమ్మాలి. అప్పుడే అంతా అర్థమవుతుంది’’ అంటోంది బెంగాలీ బ్యూటీ స్వస్థికా ముఖర్జీ. శరీరాకృతి గురించి ఆందోళన చెందవద్దని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచిస్తోంది. పలు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్న స్వస్థిక తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తన ఫొటోలను షేర్‌ చేసిన ఆమె.. బాడీ పాజిటివిటీ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

‘‘గ్లామర్‌ ప్రపంచంలో అందానికి నిర్ణీత ప్రమాణాలు నెలకొల్పుతుంది.. సమాజం కూడా వాటినే అనుసరించాలనే భావన గల దేశంలో మనం ఉన్నాం. నా వరకైతే అలాంటి ప్రమాణాలు అస్సలు నచ్చవు. నిర్వచనాలకు అతీతంగా.. ప్రతి ఒక్కరు అందమైన వారే. ఈ విషయాన్ని మనం బలంగా నమ్మలి. కొంతమంది తమ ఫొటోలకు మెరుగులు దిద్ది.. సహజత్వాన్ని కోల్పోయే విధంగా వాటిని తయారుచేస్తారు. కానీ నేను అలాంటి దాన్ని కాదు.

నా శరీరం ఎలా ఉందో అచ్చంగా అలాగే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. మీరూ అలాగే ఉండండి’’ అంటూ తన రూపాన్ని కెమెరాలో అందంగా చిత్రించిన ఫొటోగ్రాఫర్‌కు స్వస్థిక ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. కాగా హేమంతర్‌ పఖీ సినిమాతో 2001లో బెంగాలీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్వస్థికా ముఖర్జీ.. ‘మస్తాన్‌’తో స్టార్‌గా గుర్తింపు పొందింది. పలు బెంగాలీ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకున్న ఆమె... దిల్‌ బెచారాలో చివరిసారిగా కనిపించింది. ఇక పాతాళ్‌ లోక్‌, బ్లాక్‌ విడోస్‌ వంటి హిందీ వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

చదవండి: Hina Khan: ‘అవును రిలేషన్‌లో ఉన్నాం.. పెళ్లికి ఇంకా టైం ఉంది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement