ప్రయాణికులసమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులసమస్యలు పరిష్కరిస్తాం

Jun 22 2024 12:54 AM | Updated on Jun 22 2024 12:54 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రయాణికుల సూచనలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం పలువురు ప్రయాణికుల నుంచి ఫోన్‌ ద్వారా సూచనలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి అదిలాబాద్‌ వరకు బస్సు నడపాలని, ప్రతి అర గంటకు మహబూబ్‌నగర్‌ నుంచి గచ్చిబౌలీ వరకు బస్సులు నడపాలని, మహబూబ్‌నగర్‌ నుంచి నవాబ్‌పేట, కొల్లూరు, కొందుర్గు, తూంపల్లి మీదుగా చౌదర్‌గూడ వరకు బస్సు నడపాలని, మహబూబ్‌నగర్‌ నుంచి కోయిల్‌కొండ, లింగాల్‌చేడ్‌, గుండుమాల్‌, పెద్దాపురం, వీరారం, కొమ్మూరు మీదుగా కోస్గికి బస్సు నడపాలని ప్రయాణికులు కోరారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ నుంచి బిజినేపల్లి మీదుగా నందివడ్డెమాన్‌ బస్సును పునరుద్ధరించాలని, వనపర్తి నుంచి రాయచూర్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపాలని, యానాగుంది– గుండుమాల్‌ నైట్‌హాల్ట్‌ బస్సు నడపాలని, గోపల్‌దిన్నె, వీపనగండ్ల మీదుగా కొల్లాపూర్‌కు బస్సు నడపాలని సాయంత్రం 4 గంటల నుంచి కొడంగల్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు బస్సులు అందుబాటులో ఉంచాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement