తొలగించడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

తొలగించడం అన్యాయం

Published Sun, Jun 23 2024 12:46 AM | Last Updated on Sun, Jun 23 2024 12:46 AM

తొలగి

రూ.2500 వేతనంతో పాఠశాలను స్వచ్ఛతగా ఉంచడమే కాకుండా విలువైన వస్తువులు, రికార్డులకు భద్రతగా ఉంచేవాళ్లం. అకస్మాత్తుగా తమను విధుల్లో నుంచి తొలగించడం అన్యాయం. ఇప్పటికై నా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.

– లక్ష్మిదేవి, స్వీపర్‌, తిర్మలాపూర్‌

పని భారం పెరుగుతుంది

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, బ్లీచింగ్‌ చల్లడం వీటికే సమయం సరిపోవడం లేదు. తాజాగా పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేసి తాగునీరు ఏర్పాటు చేయాలంటే మరింత భారంగా మారుతుంది.

– వెంకటయ్య, పారిశుద్ధ్య కార్మికుడు, లక్ష్మిపూర్‌

స్వచ్ఛత కరువైంది

పాఠశాల పారిశుద్ధ్య చర్య లు చేపట్టడానికి పంచాయతీలకు బాధ్యత అప్పగించడం ఇబ్బంది కరమై న విధానం. జీపీ కార్మికులు కేవలం పాఠశాల ఆవరణలో మాత్రమే శుభ్రం చేసి వెళ్తారు. గదు లు, మరుగుదొడ్లు, మూత్రశాలల వైపు వెళ్లకపోవడంతో పూర్తి స్థాయిలో స్వచ్ఛత ఉండదు. గ తంలో మాదిరి స్కావెంజర్లను ఏర్పాటు చేస్తే మొత్తం శుభ్రం చేస్తూ విలువైన సామగ్రిని సైతం భాద్యతతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆమ్లెట్‌ గ్రామాలకు వారానికి ఒకసారి మాత్ర మే జీపీ కార్మికులు పాఠశాలలు శుభ్రం చేస్తున్నారు. స్కావెంజర్లను వెంటనే తీసుకోవాలి.

– శేర్‌కృష్ణారెడ్డి, తపస్‌ జిల్లా అధ్యక్షుడు

పంచాయతీ సిబ్బందితోనే..

ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు, అటెండర్లు లేని చోట విద్యార్థుల సంఖ్య ఆధారంగా గతంలో తాత్కాలిక పద్ధతిలో పారిశుద్ధ్య చర్యల నిర్వహణకు స్కావెంజర్లను నియమించారు. అయితే ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పాఠశాలల్లో పారిశుద్ధ్య చర్యలు పంచాయతీలకు అప్పగించింది. ఈ ఏడాది సైతం పంచాయతీ సిబ్బందితోనే శుభ్రం చేయించుకోవాలి. ఎక్కడ స్కావెంజర్లను విధుల్లో తీసుకోరాదు.

– ఎండీ అబ్దుల్‌ఘని, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
తొలగించడం అన్యాయం 
1
1/1

తొలగించడం అన్యాయం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement