పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు

Jun 25 2024 1:50 AM | Updated on Jun 25 2024 1:50 AM

పారదర

పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు

నారాయణపేట రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని విద్యాశాఖ జేడీ (డీఎస్‌సీ) మధన్‌మోహన్‌ యాదవ్‌ అన్నారు. పట్టణంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం అకస్మికంగా తనిఖీ చేసి, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరుగుతున్న విధానం పరిశీలించారు. అనంతరం ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు, ఇబ్బందులకు సంబందించి సందేహాలను నివృత్తి చేశారు. టెక్నికల్‌ సమస్యలు తలెత్తినట్‌లైతే వెంటనే డీఎస్‌సీని సంప్రదించాలని సూచించారు. ప్రిపరెన్షియల్‌ కేటగిరి, స్పౌజ్‌తో పాటు ఇతర కేటగిరీలకు సంబందించి నిబంధనల ప్రకారం చేపట్టాలని, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్నాకే అప్‌లోడ్‌ చేయాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణంగా పరిశీలించి తప్పకుండా న్యాయం చేయాలన్నారు. రోస్టర్‌ విధానంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వరాదని, సొంత ఆలోచలను, నిర్ణయాలను ఉపయోగించరాదన్నారు. సమావేశంలో డీఈఓ ఎండీ అబ్దుల్‌ఘని, ఏఎంఓ విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉదయబాను, శ్రీకాంత్‌, కమిటి సభ్యులు బాలకిష్టప్ప, మల్లికార్జున్‌, బాలాజి, శశికుమార్‌, కలీబ్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

జేడీని కలిసిన యూనియన్‌ నాయకులు

జేడీని పీఆర్‌టీయూ, తపస్‌ ఉపాధ్యాయ సంఘ నాయకులు కలిసి సమస్యలను తెలియచేశారు. అలాగే, బదిలీలు, పదోన్నతుల్లో కోరుకున్న చోటు రావడంతో మిఠాయిలు తినిపించారు. నర్సింహారెడ్డి, యాద్గీర్‌ జనార్ధన్‌రెడ్డి, శేర్‌కృష్ణారెడ్డి, నర్సింహా, కిశోర్‌, మొల్గాన్‌జనార్ధన్‌ పాల్గొన్నారు.

పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు 
1
1/1

పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement