ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

Published Tue, Jun 25 2024 1:52 AM | Last Updated on Tue, Jun 25 2024 1:52 AM

ఎరువు

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

దామరగిద్ద: రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ అన్నారు. సోమవారం మండలంలోని దామరగిద్ద ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను, ఇతర పర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విక్రయాలు, స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. వానాకాలం సీజన్‌కు రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను ఎప్పటికప్పుడు ఈ–పాస్‌ మిషన్‌లో నమోదు చేయాలని, ఫిజికల్‌ బ్యాలెన్స్‌, ఈపాస్‌ బ్యాలెన్స్‌ను సరిచూసుకోవాలని ఆదేశించారు. ఎరువులు విక్రయించే క్రమంలో రైతు ఆధార్‌ నెంబర్‌తో ఈ పాస్‌ మిషన్‌లో నమోదు చేయాలన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పొంది విత్తన ఎంపిక, చీడపీడల నివారణ నుండి పంట నష్టాలను నివారించుకోవాని సూచించారు.

చెంచు మహిళకు న్యాయం చేయాలి

నారాయణపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ముళ్ళచింతపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మను నిర్బంధించి దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని.. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచు మహిళ తన భూమిలో తాను పని చేసుకుంటూ జీవిస్తుండగా.. కనీసం మానవత్వం లేకుండా ఇంట్లో బంధించి దాడి చేసిన ముగ్గురిపై చర్య తీసుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు సునీతతోపాటు నరసింహ, ప్రశాంత్‌, వెంకట్‌ రాములు, హాజీ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీలో 49.9శాతం ఉత్తీర్ణత

నారాయణపేట రూరల్‌: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లోను జిల్లా వెనుకబాటులోనే ఉంది. మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో 2487మంది హాజరుకాగా 1242మందితో 49.9శాతం పాస్‌ అయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 154కు 94మంది పాస్‌కాగా 61శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1648మందికి 544మందితో 33శాతం పాస్‌ కాగా, ఒకేషనల్‌లో 96కు 48మంది పాస్‌ అయి 50శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎరువులు, విత్తనాలు  అందుబాటులో ఉంచాలి 
1
1/1

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement