‘కోల్డ్‌వార్‌’పై ఎస్పీ ఆరా | - | Sakshi
Sakshi News home page

‘కోల్డ్‌వార్‌’పై ఎస్పీ ఆరా

Published Tue, Jun 25 2024 1:52 AM | Last Updated on Tue, Jun 25 2024 1:52 AM

‘కోల్డ్‌వార్‌’పై ఎస్పీ ఆరా

కోస్గి: స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రెండు వర్గాలు ఏర్పడి చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటలు, ఒకే బ్యాచ్‌కు చెందిన ఓ ముగ్గురు సిబ్బంది వ్యవహారశైలిపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోల్డ్‌వార్‌’ కథనం జిల్లా పోలీస్‌ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయమై జిల్లా ఎస్పీ కోస్గి పోలీస్‌ స్టేషన్‌ వ్యవహారంపై, స్టేషన్‌లో లాంగ్‌ స్టాండింగ్‌గా ఒకేచోట ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారు, ఆరోపణలు ఉన్న సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అంతర్గత పోరు, కథనంలో ప్రస్తావించిన ఆ ముగ్గురికి సంబందించిన పూర్తి వివరాలు, పనితీరు, స్టేషన్‌లో పరిస్థితులపై నివేదిక కోరినట్లు సమాచారం. ముగ్గురిలో ఒకరిని ‘ప్రత్యేక’ విధుల నుంచి తప్పించి వేరే చోటుకి బదిలీ చేశారని, స్టేషన్‌లో విధులు నిర్వహించే మరొకరిని వేరే చోటుకి బదిలీ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఏది ఏమైన కోస్గి పోలీస్‌ స్టేషన్‌లో కోల్డ్‌వార్‌ అటు అధికార వర్గాల్లో, ఇటు రాజకీయ నేతల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కొందరు పోలీసు అధికారులను వివరణ కోరగా ఈ అంశం జిల్లా బాస్‌ పరిధిలో ఉందంటూ వివరణ ఇచ్చేందుకు వెనుకడుగు వేయడం శోచనీయం.

ముగ్గురిలో ఇద్దరు బదిలీ, ప్రత్యేక విధుల నుంచి ఒకరి తొలగింపు..?

సర్వత్రా చర్చనీయాంశంగా మారిన కథనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement