
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
నారాయణపేట టౌన్: సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో నడిస్తే ప్రజలకు కొంతమేర సేవ చేసిన వారమవుతామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆమె హాజరయ్యారు. ముందుగా బంజారా, గిరిజనులు చేపట్టిన శోభాయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా ఎర్రగుట్ట వరకు సాగింది. ఈ సమావేశానికి ఆర్డీఓ రాంచంద్ర నాయక్ హాజరై ప్రసంగించారు. ఆయన బోధనలు అందరూ ఆచరించాలని అన్నారు. కార్యక్రమానికి పూజారి రాము నాయక్,గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రమావత్ నరేష్, నర్సిగ్ నాయక్, ఉమ్మడి జిల్లా గిరిజన నాయకులు హాజరయ్యారు.
ఆదర్శప్రాయుడు..
మరికల్: సంత్ సేవాలాల్ గిరిజనుల అభ్యున్నతికి.. వారి చైతన్యానికి ఎనలేని కృషి చేశారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మరికల్ మండలంలోని బూడ్యగానితండాలో శనివారం సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం మరికల్ వరకు గిరిజన మహిళలు ర్యాలీ నృత్యాలు చేస్తు చౌరస్తాలో జయంతి సంబరాలను నిర్వహించారు.

సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి

సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
Comments
Please login to add a commentAdd a comment