పోలీసు బందోబస్తు నడుమ..
మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో చేపట్టిన భూ సర్వేపై రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అధికార బృందాన్ని అడ్డుకుంటున్నారు. ఊట్కూర్ మండలంలోని బాపూర్, దామరగిద్ద మండలంలోని వత్తుగుండ్ల తండా, మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి రైతులు భూ సర్వేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. రైతులు భూ నష్టపరిహారం చెల్లింపు విషయంలో నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేను కలిసి విన్నవించాలని.. సర్వే పనులను అడ్డుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment