నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం శనగలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.6,080 ధర పలికింది. మొత్తం 17 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. వేరుశనగకు గరిష్టంగా రూ.6,676, కనిష్టంగా రూ.4,300 ధర పలికింది. 192 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. తెల్ల కందులు గరిష్టంగా రూ.7,756, కనిష్టంగా రూ.6,321, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,569, కనిష్టంగా రూ.6,652 పలకగా రెండు కలిపి 433 క్వింటాళ్లను వ్యాపారస్థులు కొనుగోలు చేశారు.
రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ ధర రూ.7వేలు దాటింది. ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే మొదటి సారి అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యార్డుకు 2,662 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,019, కనిష్టంగా రూ.4,322 లభించింది. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,300, ఆముదా లు రూ.5,560, జొన్నలు రూ.3,751, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,195, కనిష్టంగా రూ.5,820, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,929 ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment