జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
నారాయణపేట రూరల్: జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంవత్సరాలుగా నెలకొన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పరిష్కార మార్గం చూయిస్తుందని అన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయం ప్రెస్ అకాడమీ సూచనల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు నామాజీ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో శాశ్వత ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యయాదవ్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు విజయ సాగర్, సిపిఎం నాయకులు వెంకట్రామిరెడ్డి, సిపిఐ ఎంఎల్ నాయకులు కాశీనాథ్, సిఐటియు నాయకులు బలరాం, సిటిజన్ క్లబ్ సభ్యులు, వివిధ జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment