ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పేట జిల్లాలో దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఎం చేశారు. రూ.56 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అలాగే రూ.130 కోట్ల అంచనా వ్యయంతో వైద్య కళాశాల నూతన హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, రూ.40 కోట్లతో నిర్మించనున్న 100 పడకల యూనిట్‌కు శంకుస్థాపన, రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ పోలీస్‌స్టేషన్, నారాయణపేటలో నిర్మించిన రూరల్ పోలీస్‌స్టేషన్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. రూ.1.23 కోట్లతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. రూ.295 కోట్లతో తుంకిమెట్ల– నారాయణపేట రోడ్, కోటకొండ– మద్దూరు రోడ్డు అభివృద్ధి పనులు, అప్పక్‌పల్లి– గుండుమాల్ రోడ్డు, మద్దూరు– లింగాల్‌చేడ్ రోడ్డులలో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.193 కోట్లతో గుల్బర్గా– కొడంగల్ , రావులపల్లి– మద్దూరు, కోస్గి– దౌల్తాబాద్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో సీఆర్‌ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.7 కోట్లతో మరికల్‌లో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment