నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నారాయణపేట నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రానున్న నాలుగేళ్లలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం అభివృద్ధిలో తొలిమెట్టు అని అన్నారు. ఏడాది క్రితం ప్రజలంతా ఆశీర్వదించడంతో ఎమ్మెల్యేగా గెలిచానని, పదేళ్ల కిందటి వరకు ఒక లెక్క.. ఈరోజు నుంచి ఒక లెక్క అని చెప్పా.. ఇచ్చిన మాట ప్రకారం రూ.వెయ్యి కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు. సభకు పురుషులకంటే మహిళలే అధికంగా వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment