హుండీ లెక్కింపు పూర్తి
నారాయణపేట రూరల్: మండలంలోని ఎక్లాస్‌పూర్ తిమ్మప్పస్వామి ఆలయానికి సంబంధించి జాతర పూర్తి కావడంతో శనివారం ఆలయ హుండీ లెక్కింపును చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి శ్యాంసుందర్ జోషి, అర్చకులు మాణిక్ శాస్త్రి ఆధ్వర్యంలో, పోలీసు బందోబస్తు మధ్య గ్రామస్తులు హుండీలో నగదు లెక్కించారు. రూ.2.85లక్షలు వచ్చినట్లు ప్రకటించారు. అదేవిధంగా టెంకాయలు, ఇతర టెండర్లు, హర్షిక ఆదాయాన్ని లెక్క కట్టగా మొత్తం రూ.8,78, 606 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామ్ రెడ్డి, కన్నా జగదీష్, మధుసూదన్ రెడ్డి, రమాకాంత్, సత్యనారాయణ, బాలప్ప పాల్గొన్నారు.
శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తుల చేత ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేక పూజలు చేయించారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు చేశార. అనంతరం బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,841
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 3,149 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,841, కనిష్టంగా రూ.4,009 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,000, కనిష్టంగా రూ.5,667, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,388, కనిష్టంగా రూ.2,270, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.5,555, పత్తి గరిష్టంగా రూ.6,109, కనిష్టంగా రూ.5,889 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,716, కనిష్టంగా రూ.5,709, కందులు గరిష్టంగా రూ.6,909, కనిష్టంగా రూ.6,709గా ధరలు నమోదు అయ్యాయి.
హుండీ లెక్కింపు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment