విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని, విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన తెలపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కనీసం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యారంగాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ఓ పక్క గురుకుల విద్యాలయాల్లో పుడ్ పాయిజన్‌తో విద్యార్థులు మరణిస్తుంటే మరో పక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటిలో అరకొర సౌకర్యాలు, అధ్యాపకుల లేమి, మంచి నీటి సమస్య, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌లు లాంటి ఎన్నో లోపాలతో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. గౌస్, వెంకటేష్, సురేష్, సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment