తెలంగాణకు అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఆగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పథకం అమల్లో అంకితభావం, విజయాలకు గుర్తింపుగా తెలంగాణకు అవార్డును అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌కు అవార్డును ప్రదానం చేశారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అమల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించారు.
కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.2,836 కోట్ల మేర ప్రయోజనం లభించింది, ఈ నిధులతో 2,199 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు నెలకొల్పామని రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో నెలకొలి్పన యూనిట్లలో ప్రధానంగా 1,322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 163 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 101 పోస్ట్–హార్వెస్ట్ సౌకర్యాలున్నాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులు మెరు గైన వసతులతో అధిక ఆదాయం పొందుతున్నా రని రఘునందన్ రావు తెలిపారు.
ఈ స్కీమ్ కింద అత్యుత్తమ పనితీరున్న జిల్లాలుగా నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట గుర్తింపు పొందాయి. ఈ స్కీమ్ కింద రైతులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తోంది. తద్వా రా రైతులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకునే రుణాలపై 6% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల రుణం వరకు వేరే హామీ అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment