![Bombay HC Women Lawyers Write Kiren Rijiju Bar Council Reservations - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/16/kiren-rejiju.jpg.webp?itok=FSY4WKfZ)
సాక్షి, న్యూఢిల్లీ: బార్ కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుకు బాంబే హైకోర్టు మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. అడ్వొకేట్స్ చట్టం–1961ను సవరించాలని కోరారు. లీగల్ ప్రొఫెషన్‌లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ... నిర్ణయాత్మక స్థానాల్లో మహిళాలాయర్లకు స్థానం దక్కడం లేదని లేఖలో పేర్కొన్నారు.
అదే విధంగా... సుప్రీంకోర్టులో 416 సీనియర్ న్యాయవాదుల్లో కేవలం 8 మంది మాత్రమే మహిళలున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలో ఒక్కో మహిళ ఉన్నారని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర–గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, కర్ణాటక, కేరళ తదితర బార్ కౌన్సిళ్లలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment