ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాహనాల పార్కింగ్ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చేలరేగడంతో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసు శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.
అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. 12 ఫైర్ ఇంజన్లు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment