
1..ఘోర విమాన ప్రమాదం.. పైలెట్ సిగరెట్ అంటించడం వల్లే 66 మంది ప్రాణాలు గాల్లోకి!
ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2.. Karnataka CM Bommai: కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఈ సందర్భంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3.. BSP Mayawati: దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందన్నారు. రాష్ట్రపతి కావాలనే కాంక్ష తనకు అసలులేదని మాయావతి స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4..గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్
రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చాం.. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపం.. లవర్ ఏం చేసిందంటే.. వీడియో వైరల్
ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రమంలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6.. Hero Nikhil: హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూత
యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7..కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?!
ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పలువురు సీనియర్ క్రికెటర్లకు రెస్ట్ ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. కోహ్లి సహా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వనుంది. వీరి గైర్హాజరీలో శిఖర్ ధావన్ జట్టును నడిపించే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8.. ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇన్ఫోసిస్‌కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసులు అందజేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9..ఆ విధానం యుద్ధాన్ని ఆపడంలో సహాయపడదు
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భారత్ వైఖరిని తప్పుబట్టడమే కాకుండా భారత్ అవలంభిస్తున్న తటస్థ వైఖరి యుద్ధాన్ని ఆపలేదని చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ పట్ల భారత్ చూపిస్తున్న సానూభూతిని అభినందిస్తున్నాం కానీ ఈ తటస్థ వైఖరి యుద్ధాని ఆపేందుకు ఉపయోగపడదని నొక్కి చెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10.. Summer Drinks: మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ.. ఆహారం జీర్ణమవడంతో పాటుగా..
దీనా, నిమ్మరసం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక వేసవిలో లభించే మామిడిపండు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తాయి. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్నో ఉపయోగాలు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment