1.. బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం జగన్ భేటీ
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెంటర్‌లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2.. రేవంత్ రెడ్డి ఓ దొంగ.. అది రచ్చబండ కాదు లుచ్చా బండ : మల్లారెడ్డి
కాంగ్రెస్ దివాలా తీసిన దరిద్రపు పార్టీ అని, రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ తనపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా.. టీఆర్‌ఎస్‌ఎల్పీ నుంచి మంగళవారం ఆయన మీడియా ద్వారా మాట్లాడారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. అవినీతి ఆరోపణలు.. పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్
పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. Sri Lanka Crisis: భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5.. ‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్ ఉదయ్ భాస్కర్) చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం జగన్ చెప్పారని జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం అంబటి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ అనంతబాబు హత్యకేసులో ఇరుక్కున్నారు. చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు. ధర్మం వైపే ఉంటామని ప్రభుత్వం చెప్పింది’ అని తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Pan India Movie: నానితో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ!
సలార్, ఎన్టీఆర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ మరో టాలీవుడ్ హీరోతోనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7.. WEF: పర్యాటక రంగాన్ని వీడని పరేషాన్
దావోస్‌లో జరుగుతున్న వలర్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ కుదురుతున్న వివిధ వ్యాపార ఒప్పందాలతో పాటు పలు కీలక అంశాలపై వెలువడుతున్న నివేదికలపై ఆసక్తి నెలకొంది. కాగా పర్యాటక రంగంపై విడుదలైన వివేదిక మరోసారి ధనవంత దేశాలకే పట్టం కట్టింది. 117 దేశాలకు సంబంధించిన సమాచారంతో ఈ ఇండెక్స్ తయారు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8.. సచిన్ తనయుడికి మరో అవమానం.. ముంబై రంజీ జట్టులోనూ నో ప్లేస్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మరో అవమానం జరిగింది. రంజీ నాకౌట్స్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతని స్థానం గల్లంతైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.. Healthy Heart Tips: ఈ ఆహార పదార్థాలు తినడం అలవాటా.. అయితే ప్రమాదం పొంచిఉన్నట్లే!
ఇటీవల కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారంన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10.. ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి
జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగింది. యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment