1.. Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్! ఇప్పుడేమో ఇలా..
ఎలన్ మస్క్‌కు ఉన్న ఫాలోయింగ్, అభిమాన గణం సంగతి ఏమోగానీ.. తాజాగా ఆయన చేసిన ఓ రీట్వీట్ ఎక్కువ విమర్శలకే దారి తీసింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఎక్స్ కపుల్.. జానీ డెప్-అంబర్ హర్డ్ కోర్టుకెక్కిన వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు ఎలన్ మస్క్.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2.. గుజరాత్ ఫైల్స్ బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు: ప్రధాని మోదీ
ఎనిమిదేళ్ల పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారత్ నిర్మాణానికి పని చేశానని, గుజరాత్ సిగ్గుపడేలా ఏ తప్పూ చేయలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ రాజ్ కోట్‌లో శనివారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నట్టు గుర్తు చేశారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3.. ‘ఆ దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయింది’
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ విజయభేరి మోగించబోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌కు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4.. AP Polycet 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి
పీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్ పోల భాస్కర్ తెలిపారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5.. మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి
వయోజన విద్య సూపర్‌వైజర్ బాలాజీ... స్వామి భక్తి చాటుకునేందుకు సెలవు చీటీ పెట్టారు. బంధువుల గృహప్రవేశమని చెప్పి కార్యాలయానికి డుమ్మా కొట్టిన ఆయన శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో కీలకంగా వ్యవహరించారు. వయోజన విద్యలో విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఆరేళ్ల క్రితం ప్రభుత్వం డిప్యుటేషన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏగా నియమించింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6.. F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7.. వాళ్లిద్దరు అద్భుతం చేశారు.. ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు: సచిన్ ప్రశంసలు
రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్‌లను టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసించాడు. తమ అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని పేర్కొన్నాడు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8..Elon Musk: ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి..
ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. కోట్లకు కోట్ల రూపాయలు అతని బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఉన్నాయి. అయినా సరే ఆయనకు సంపాదనపై యావ తగ్గడం లేదు. ఇంకా ఇంకా డబ్బు కావాలంటూ అర్రులు చాస్తున్నాడు. ఆయనెవరో కాదు ఈలాన్ మస్క్.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.. Panasa: పనస పండు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఇక జ్యూస్ తాగితే!
పనసలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, టైప్ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10..రథోత్సవంలో అపశ్రుతి.. రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
నాంపల్లి మండలం కేతేపల్లి వద్ద ఓ ఆలయం సమీపంలో శనివారం ప్రమాదం సంభవించింది. శ్రీరామ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథాన్ని రథశాలకు చేర్చుతుండగా కరెంట్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment