లారీ ఢీకొని 8 మేకలు మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని 8 మేకలు మృతి

Published Tue, Jun 25 2024 2:28 AM | Last Updated on Tue, Jun 25 2024 2:28 AM

లారీ ఢీకొని 8 మేకలు మృతి

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ రూరల్‌ మండలం గాంధీనగర్‌ తండా వద్ద సిమెంట్‌ లారీ ఢీకొని ఎనిమిది మేకలు మృతి చెందాయి. బాన్సువాడ నుంచి నిజామాబాద్‌ వైపు వస్తున్న లారీ గాంధీనగర్‌ తండా వద్ద రోడ్డు దాటుతున్న మేకల మందను ఢీకొంది. తండాకు చెందిన లక్ష్మణ్‌ మేకలు చనిపోయాయి.

బోరు మోటార్ల చోరీ

రెంజల్‌(బోధన్‌): మండలంలోని తాడ్‌బిలోలి రైతులకు చెందిన బోరు మోటార్లు, కేబుల్‌ వైర్లు చోరీకి గురయ్యాయి. ఆదివారం దొంగలు అలీసాగర్‌ ఎత్తిపోతల కాల్వలో వేసిన మోటార్లు, కేబుల్‌ వైర్లను ఎత్తుకెళ్లినట్లు రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ డైరెక్టర్‌ అబ్దుల్‌ మౌలానా తెలిపారు. నవీపేట్‌ మండలం కోస్లీ శివారులో తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన 8 మంది రైతుల మోటార్లు, కేబుల్‌వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు. నవీపేట్‌, రెంజల్‌ ఎస్సైలు సోమవారం సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఇసుక నిల్వలు సీజ్‌

రెంజల్‌(బోధన్‌): మండలంలోని బోర్గాం శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. స్థానికులు అందించిన సమాచరం మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. కందకుర్తి గోదావరి నుంచి అక్రమంగా రవాణా చేసి పంటపొలాల్లో నిల్వ చేసిన సుమారు 1000 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

పోక్సో కేసు నమోదు

బోధన్‌రూరల్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దా డికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై నాగనాథ్‌ తెలిపారు. సోమవారం బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మూడు ఇసుక టిప్పర్ల పట్టివేత

ఎడపల్లి: మండలంలోని జానకంపేట శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను సోమవారం తెల్లవారుజామున ఎస్సై వంశీకృష్ణరెడ్డి పట్టుకున్నారు. వివరాలు.. బోధన్‌ మండలం కొప్పర్గ మంజీర నుంచి అక్రమంగా ఇసుకను మూడు టిప్పర్లలో ఎడపల్లి మండలం మీదుగా నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై దాడి చేసి టిప్పర్లను పట్టుకున్నారు.

అదుపు తప్పి లారీ బోల్తా

భిక్కనూరు : మండలంలోని అంతంపల్లి శివా రు ఎడ్లకట్లవాగు సమీపంలో సోమవారం ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. గ్రామం నుంచి మండల కేంద్రానికి వస్తున్న లారీ మలుపు వద్ద రోడ్డు కిందకు వెళ్లి పడిపోగా అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వాహనాల తనిఖీ

నందిపేట్‌: నందిపేటలో రవాణా శాఖ అధికారులు సోమవారం వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను, రెండు గూడ్స్‌ వాహనాలు, ఒక ట్రాలీ ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. మండల కేంద్రానికి చెందిన నాలుగు ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ లేదని, అనుభవం లేని డ్రైవర్లతో నడుపుతుండటంతో సీజ్‌ చేసినట్లు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వివేకానంద రెడ్డి తెలిపారు. ఆర్టీఏ సిబ్బంది మనోజ్‌, దశరథ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement