విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Jun 25 2024 2:30 AM | Updated on Jun 25 2024 2:30 AM

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని వసతి గృహా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ మహేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం క్యాంపస్‌లోని ఓల్డ్‌ బాయ్స్‌, న్యూ బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టల్స్‌ను వార్డెన్లతో కలిసి చీఫ్‌ వార్డెన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్స్‌ కేర్‌టేకర్స్‌, వంట మనుషులు, వర్కర్లు, మెస్‌ కమిటీ మెంబర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రార్‌ యాదగిరి ఆదేశాల మేర కు హాస్టల్స్‌ను తనిఖీ చేశామన్నారు. గత శుక్రవారం బాలికల హాస్టల్‌లో అల్పాహారంలో కీటకం వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామన్నా రు. హాస్టల్స్‌ సిబ్బంది మెస్‌తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తాజా కూరగాయలు, సరుకులను వంటకు ఉపయోగించి రుచితో పాటు నాణ్యమైన ఆహారం అందించేందు కు కృషి చేయాలన్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్లు కిరణ్మయి, కిరణ్‌రాథోడ్‌, గంగాకిషన్‌, కేర్‌టేకర్లు జమున, డిగంబర్‌ చౌహాన్‌, క్రాంతికుమార్‌, గ్రోసరీ, వెజిటబుల్స్‌ సప్లయర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement