కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన పోచారం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన పోచారం

Jun 25 2024 2:30 AM | Updated on Jun 25 2024 2:30 AM

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన పోచారం

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన పోచారం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలను బాన్సువాడ ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్‌రెడ్డి కలిశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీలోని అక్బర్‌ రోడ్డులో గల ఏఐసీసీ కార్యాలయంలో అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పోచారంను నేతలకు పరిచయం చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యడు ఖర్గేను పోచారం సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, రాజీవ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement