స్పందన కరువు
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సూర్యఘర్
యోజనకు
పార్వతీపురం టౌన్:
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వచ్చే ఏడాది మార్చినాటికి జిల్లాలో సుమారు 5వేల యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 560 మంది దరఖాస్తు చేయగా, 83 మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 45 మంది ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటుచేశారు. సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. సౌరవిద్యుత్ ప్యానళ్లు, ఇతర సామగ్రికి అయ్యే వ్యయంలో దాదాపు సగం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకునే వెసులుబాటు ఉన్నా అధికమంది ఆసక్తి చూపడంలేదు.
యూనిట్ల ఏర్పాటు ఇలా...
రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. నెలకు 120 యూనిట్లు ఉపయోగించే వారికి ఒక కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంటు ఇంటి డాబాపై ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు. ఈ యూనిట్‌కు రూ.60 వేలు ఖర్చవుతుంది. అందులో రూ.30 వేలు రాయితీ వస్తుంది. నెలకు 240 యూనిట్లు వినియోగించేవారు రెండు కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంటు పెట్టుకోవచ్చు. దీనికి లక్షా20వేలు లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ.60 వేలు రాయితీగా లభిస్తుంది. నెలకు 360 యూనిట్లు ఉపయోగిస్తే మూడు కిలోవాట్ల వవర్ ప్లాంటు పెట్టుకోవచ్చు. దీనికి ఖర్చయ్యే రూ.లక్షా 80వేలలో 90వేలు రాయితీ వస్తుంది. సోలార్ రూఫ్ టాప్‌కు 25 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నారు. డీలర్లు ఐదేళ్లపాటు ఉచిత సర్వీసు అందిస్తారు.
న్యూస్‌రీల్
పథకంపై ఆసక్తి చూపని జిల్లా వాసులు
50 శాతం రాయితీ ఉన్నా
వినియోగించుకోని వైనం
జిల్లాలో ఇప్పటివరకు కేవలం
506 దరఖాస్తులు
45 యూనిట్ల బిగింపు
డబ్బులు చెల్లించినది 83 మందే...
అపోహలు వద్దు
సోలార్ పవర్ వల్ల విద్యుత్ బిల్లు భారీగా తగ్గిపోతుంది. మొదట పెట్టుబడి అధికంగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్ టాప్‌ల విషయంలో ఎటువంటి అపోహలు అవసరంలేదు. బ్యాంకులు రుణంగా ఇస్తాయి. పదేళ్లలో బ్యాంకు అప్పు తీరిపోతే 15 సంవత్సరాలపాటు ఇంటికి ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు మరికొంత సొమ్ము ఏపీఈపీడీసీఎల్ నుంచి వస్తుంది.
– చలపతిరావు, ఏపీఈపీడీసీఎల్, ఎస్‌ఈ
స్పందన కరువు
స్పందన కరువు
Comments
Please login to add a commentAdd a comment