ఉపాధ్యాయసంఘాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పార్టీల కతీతంగా స్వతంత్రంగా, కేవలం ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్నానని గాదెశ్రీనివాసులునాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మెరకముడిదాం మండలంలోని భైరిపురం, గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి, గరుగుబిల్లి, సాతాంవలస జెడ్పీపాఠశాలలతో పాటు మెరకముడిదాం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, గర్భాం ఏపీ మోడల్‌స్కూల్‌లో పర్యటించి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి నట్లయితే చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే మహిళలకు అవసరమైన మరిన్ని సెలవులను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆల్తిరాంబాబు, జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మండలానికి చెందిన పలు యూనియన్ల నాయకులు ఆర్.సింహాద్రి, టీవీవీఎల్.నరసింహులు, కృష్ణ, సత్తారు రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎంటీఎస్ ఇప్పించండి
కాగా మెరకముడిదాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెశ్రీ నివాసులనాయుడిని మెరకముడిదాం మండలానికి చెందిన ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు (పార్ట్‌టైమ్ ఉద్యోగులు, సీఆర్‌ఎంటీలు, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది) కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తమకు ఎంటీఎస్ ఇప్పించాలని, అలాగే తమను పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా కాకుండా ఒకేషనల్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం పరిగణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన గాదె శ్రీనివాసులునాయుడు తాను గెలుపొందిన వెంటనే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్‌కుమార్, శంకర్రావు, సత్యవతి, ఉగాది తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు
Comments
Please login to add a commentAdd a comment