మహాశివరాత్రికి రామతీర్థంలో గట్టి పోలీస్ బందోబస్తు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై దేవస్థానం సిబ్బందితో చర్చించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులకు దన్నానపేట జంక్షన్ వద్ద, విజయనగరం వైపు నుంచి వచ్చే భక్తులకు సీతారామునిపేట జంక్షన్ వద్ద పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జాతరలో నిరంతర నిఘా ఉంటుందని, డ్రోన్స్‌ను వినియోగించి గస్తీ నిర్వహిస్తామన్నారు. ఆకతాయల కదలికలపై నిఘా పెడతామని, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై గణేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
సీఐ రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment