మ్యుటేషన్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లో వచ్చిన మ్యుటేషన్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి రెవెన్యూకు చెందిన పలు అంశాలపై జేసీ శోభికతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను పీజీఆర్‌ఎస్‌లో కాకుండా సర్వీసెస్‌లో నమోదు చేయాలన్నారు. న్యాయపరంగా ఎటువంటి సమస్యలు లేని భూములకు చెందిన మ్యుటేషన్లను వెంటవెంటనే పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హెమలత, కేఆర్‌సీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మాచంద్రారెడ్డి, జిల్లా వ్యవశాయశాఖాధికారి రాబర్ట్‌పాల్, సివిల్ సప్లై డీఎం పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment