జిల్లాలో ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష

Published Sat, Feb 22 2025 1:35 AM | Last Updated on Sat, Feb 22 2025 1:31 AM

జిల్ల

జిల్లాలో ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష

పార్వతీపురం టౌన్‌: జిల్లాలోని నాలుగు ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఏప్రిల్‌ 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జి ల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గల సాలూరు, మక్కువ, కురుపాం, భామిని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్‌ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఎంఎస్‌. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 1 సెప్టెంబరు 2013 నుంచి 31 ఆగస్టు 2015 మధ్యలో పుట్టి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 1సెప్టెంబరు 2011 నుంచి 31 ఆగస్టు 2015 మధ్యలో పుట్టి ఉండాలన్నా రు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా చదివి ఉండాలని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్‌ ఆర్హత పొంది ఉండాలని స్పష్టం చేశారు.

2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు క్రషింగ్‌

రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్‌లో ఇప్పటి వర కు 2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు క్రషింగ్‌ పూర్తయిందని కర్మాగార యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో ని దూర ప్రాంతాల నుంచి చెరకును క్రషింగ్‌ కోసం సకాలంలో ఫ్యాక్టరీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి చెరకును నరికించే ఏర్పాట్లు చేశామని వివరించారు.

బంగారు భవితకు

పదో తరగతి ప్రథమ మెట్టు

డీఈఓ తిరుపతినాయుడు

బలిజిపేట: విద్యార్థుల బంగారు భవితకు పదో తరగతి ప్రథమ మెట్టని, సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.తిరుపతినాయు డు సూచించారు. అజ్జాడ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం పర్యవేక్షించారు. విద్యార్థు ల ప్రీ ఫైనల్‌ జవాబు పత్రాలను పరిశీలించా రు. సబ్జెక్టుల వారీగా ఎవరికి ఎటువంటి సమస్యలున్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి పరిష్కరించుకోవాలని సూచించారు. చదువు లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూ పాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుకోగలర న్నారు. మానసిక ఒత్తిడికి గురికాకూడదన్నారు. చేతిరాత, పరీక్ష రాసే విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

పారదర్శకంగా ఎన్‌సీడీ 3.0 సర్వే

పార్వతీపురంటౌన్‌/పార్వతీపురం: అసంక్రమి త, దీర్ఘకాలిక వ్యాధులు గుర్తించేందుకు చేపడుతున్న ఎన్‌సీడీ 3.0 సర్వేను పారదర్శకంగా నిర్వహించి, ప్రజల్లో రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించాలని డీఎంహెచ్‌ఓ భాస్కరరావు వైద్య సిబ్బందికి సూచించారు. పార్వతీపురంలోని ఎన్‌జీఓ భవనంలో ఆరోగ్య పర్యవేక్షకులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టే సర్వేలను పక్కాగా చేపట్టాలన్నారు. వ్యాధుల వ్యాప్తి, కారణాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మంచి ఆహారపు అల వాట్లు, జీవనశైలితో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న అంశాన్ని తెలియజేయాలన్నారు. జ్వరాలు, డయేరియా వంటి వ్యాధుల వ్యాప్తిని ఉన్నతాధికారులకు సత్వరమే తెలియజేసి నివారణ చర్య లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికా రులు ఎం.నారాయణరావు, టి.జగన్మోహన్‌రావు, ఎం.వినోద్‌, పి.శ్రీధర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష1
1/1

జిల్లాలో ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement