చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ95 శ్రీ160 170
జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
వీరఘట్టం: వీరఘట్టంలో కొంతమంది వ్యక్తులు నకిలీ స్టాంపుల విక్రయాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనుగోలు చేసిన రూ.10, రూ.50 స్టాంపు పేపర్లను పోలిన మాదిరిగానే కలర్ జిరాక్స్‌లు తీసి అడ్డుగోలు వ్యాపారానికి తెరతీశారు. భూముల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల కోసం ఈ స్టాంపు పేపర్లు అవసరమైన వారు అవి నకిలీ అని తెలియక కొనుగోలు చేస్తున్నారు.ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పూరిల్లు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని టి.బూర్జవలసలో చింతగడ ప్రసాద్‌కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు సర్పంచ్ మంత్రి క్రాంతికుమార్, ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారని చెప్పారు. నిరుపేద అయిన ప్రసాద్‌కు చెందిన ధాన్యం, బియ్యం, పప్పు దినుసులు టీవీ ఇతర ఇంటి సామగ్రి బట్టలు, ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో కటుంబసభ్యులు రోడ్డున పడ్డారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం
పార్వతీపురంటౌన్: జిల్లా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. బృందం క్వాలిటీ కంట్రోలర్ రవికుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవితో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా అందించే కాయకల్ప అవార్డును ఇంటర్నల్ పీగ్ అసెస్‌మెంట్‌లో భాగంగా బృందసభ్యులు ఆస్పత్రిని పరిశీలించిన సందర్భంగా అస్పత్రిలో అన్ని విభాగాలను సందర్శించాచు. స్వచ్ఛత, సదుపాయాలు, బయోమెడికల్ వేస్టేజీ, పారిశుధ్య రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రసవాల సంఖ్య, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆస్పత్రి నిర్వహణ అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
జ్ఞాన జ్యోతితో చిన్నారుల సమగ్రాభివృధ్ధి
● డీఈఓ ఎన్.తిరుపతినాయుడు
గుమ్మలక్ష్మీపురం: ఐదేళ్లలోపు చిన్నారుల సమగ్రాభివృధ్ధి కోసమే జ్ఞానజ్యోతి శిక్షణ ఇస్తున్నామని..శిక్షణను సద్వినియోగం చేసుకుని చిన్నారుల సమగ్ర అభివృధ్ధికి అంగన్వాడీ కార్యకర్తలంతా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.తిరుపతినాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ శిక్షణలో నేర్పిస్తున్న అంశాలు, ఎంత వరకు అర్థం చేసుకున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం గుమ్మలక్ష్మీపు రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ పబ్లిక్ పరీక్షలను పరి శీలించారు. ఆయన వెంట ఎంఈఓలు బి.చంద్రశేఖర్, బిడ్డిక భీముడు ఉన్నారు. ఈ సందర్భంగా డీఈఓ విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 67 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు పేర్కొన్నారు.
చికెన్
చికెన్
చికెన్
Comments
Please login to add a commentAdd a comment