డిజిటల్ ఇంజనీరింగ్‌కు ప్రోత్సాహం
నర్సాపూర్ : ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ డిజిటల్ ఇంజనీరింగ్‌కు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రెనాల్ట్ గ్రూప్ (ఆసియా) హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ సిమోనా అడెలీనా అన్నారు. గురువారం బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో జాతీయ స్థాయి ఈ బాహ సే ఇండియా–2025 పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిమోనా అడెలీనా హాజరై మాట్లాడారు. డిజిటల్ ఇంజనీరింగ్‌కు తమ సంస్థ అందజేస్తున్న ప్రోత్సాహాన్ని ఆమె వివరిస్తూ ఇంటర్న్‌షిప్, ఉపాధి అవకాశాలు అందజేసే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ ఆటోమోటీవ్ ఇంజనీర్స్ ఇండియా (ఎస్‌ఏఈ) చైర్మన్ బాల్‌రాజ్ సుబ్రమణ్యం, బాహ సే ఇండియా సలహాదారుడు డాక్టర్ కేసీ వోరా, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవి చంద్రన్ రాజగోపాల్, ఆటోకార్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఎడిటర్ మయాంక్ డింగ్రా, బీపీసీఎల్ హైదరాబాద్ టెరిటరీ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఈ బాహ సే ఇండియా జాయింట్ కన్వీనర్ మనోనిత్ సింగ్, తదితరులు పాల్గొని తమ సంస్థలకు ఈ బాహతో ఉన్న సంబంధాలను వివరించారు. విద్యార్థులనుద్దేశించి సొసైటీ చైర్మన్ విష్ణురాజు పంపిన వీడియో మేసేజ్‌ను వినిపించారు. ఐదు రోజులపాటు కార్యక్రమం జరుగుతుందని, 15 రాష్ట్రాల నుంచి 80 జట్లు పాల్గొన్నాయని కాలేజీ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, ఆయా బ్రాంచ్‌ల హెచ్‌ఓడీలు, ఇతర ప్రతినిధులు బాపిరాజు, సురేశ్, కాంతారావు, రాయుడు, దశరథరామయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రెనాల్ట్ గ్రూప్ హెచ్‌ఆర్‌వైస్ ప్రెసిడెంట్ సిమోనా అడెలీనా
బాహ సే ఇండియా–2025 పోటీలు
Comments
Please login to add a commentAdd a comment