హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
నర్సాపూర్ : అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నర్సాపూర్‌కి వచ్చి విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తి అనే వ్యక్తిని బీఆర్‌ఎస్ నాయకులు హత్య చేయించారని, స్వయాన మృతుడి కూతురు బీఆర్‌ఎస్ నాయకులపై ఆరోపణలు చేసినట్లు గుర్తు చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నించే వ్యక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నీళ్లు నిధులు, నియామకాలపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిందని అవన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment