చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓటమి | Azan Awais Ton Guides Pakistan To Easy Win vs India | Sakshi
Sakshi News home page

U19 Asia Cup 2023: చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓటమి

Published Sun, Dec 10 2023 7:03 PM | Last Updated on Mon, Dec 11 2023 9:29 AM

Azan Awais Ton Guides Pakistan To Easy Win vs India - Sakshi

అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌ బ్యాటర్లలో అజాన్ అవైస్(105 నాటౌట్‌) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

అతడితో పాటు సాద్‌ బైగ్‌(68 నాటౌట్‌), షాహజిబ్‌ ఖాన్‌(63) పరుగులతో పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. బౌలర్లలో మురగన్‌ అభిషేక్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కాగా అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్‌ సింగ్‌(62), కెప్టెన్‌ ఉదయ్‌ షహరన్‌(60), సచిన్‌ దాస్‌(58) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ జీషన్‌ 4 వికెట్లతో చెలరేగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement