ఏడుసార్లు బాలన్ డి'ఓర్ విజేత, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఇంటర్ మియామీ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల ప్రారంభంలో పీఎస్‌జీ నుంచి ఇంటర్ మియామికి మారిన మెస్సీ, మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌తో మియామి తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే మెస్సీని కెప్టెన్‌ను చేసేశారు మియామి క్లబ్ నిర్వహకులు.
ఈ విషయాన్ని మియామి క్లబ్ మేనేజర్ టాటా మార్టినో సోమవారం ప్రకటించారు. మెస్సీ మియామికి ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ కొట్టాడు. క్రూజ్ అజుల్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 25 గజాల దూరం నుండి ఫ్రీకిక్ గోల్ కొట్టి, తన జట్టును 2-1తో గెలిపించాడు. 54వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మెస్సీ ఈ గోల్ కొట్టాడు.
కాగా, మెస్సీ.. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. మియామి ఆఫర్‌కు ముందు మెస్సీకి సౌదీ క్లబ్ అల్ హిలాల్, బార్సిలోనా క్లబ్‌ల నుంచి భారీ మొత్తంలో ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించాడు.
మెస్సీకి మియామి క్లబ్‌పై ఉన్న ఆసక్తిని చూసి యాజమాన్యం కేవలం ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్సీ కట్టబెట్టింది. బుధవారం (జులై 26) నుంచి ప్రారంభంకాబోయే లీగ్స్ కప్‌లో మెస్సీ మియామి నూతన సారధిగా బాధ్యతలు చేపడతాడు. ఈ లీగ్‌లో మియామి తమ తొలి మ్యాచ్‌లో ఆట్లాంటా యునైటెడ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment