
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. పొట్టి ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
దీంతో అతడిని కెప్టెన్సీ తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. బాబర్ పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ తప్పుకోని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని బాసిత్ అలీ సూచించాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఎటువంటి క్రికెట్ ఇప్పటివరకు ఆడలేదు. ఈ ఆగస్టులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం వైట్‌బాల్ సిరీస్‌లతో పాక్ బీజీబీజీగా గడపనుంది.
అయితే బాబర్ కెప్టెన్సీపై మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఏడాది తమ సొంత గడ్డపై జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై పీసీబీ దృష్టి సారించింది.
"బాబర్ పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచింది. అతడు తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి. అతడొక అద్భుతమైన ఆటగాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు అతడు చాలా విలువైన ఆటగాడు. కాబట్టి అతడి నుంచి మంచి ప్రదర్శనలు రావాలి.
గత రెండు మూడేళ్లలో మేము మాటల పరంగా మేము చాలా విషయాలు చెప్పాం. ప్రపంచకప్‌ను గెలుస్తాం, ఆసియాకప్‌ను గెలుస్తాం, భారత్‌తో ఫైనల్స్ ఆడతాం వంటి ప్రగడ్భాలు పలికాం. కానీ ఇప్పుడు అవి చేతల్లో చూపించాల్సిన సమయం అసన్నమైందని తన యూట్యూబ్ ఛానల్‌లో అలీ పేర్కొన్నాడు.