
●నేటి నుంచే రథ సప్తమి మహోత్సవాలు ●రాష్ట్ర పండుగగా రథసప్
అరసవల్లి:
వెలుగుల రేడు వేడుకకు సిక్కోలు సిద్ధమైంది. రథసప్తమి మహోత్సవాన్ని తొలిసారిగా రాష్ట్ర పండుగగా జరిపేందుకు నిర్ణయించడంతో.. అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు మహోత్సవాలను ని ర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారుల బృందాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ప్రదర్శనలకు ఉచిత ప్రవేశాలను కల్పిస్తున్నట్లుగా కలెక్టర్ స్వప్నిల్ దినక ర్ ప్రకటించారు. 3వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆదిత్యుని గర్భాలయంలోని మూలవిరాట్టుకు క్షీరాభిషేక సేవ చేయనున్నారు. అలాగే 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు స్వామి అభిషేక మూర్తి నిజరూప దర్శనం.. స్వర్ణాలంకరణతో స్వామిని చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment