
తిరువొత్తియూరు: కోవై జిల్లాలో వివాహమైన యువతిని ప్రేమించమని బెదిరింపులకు పాల్పడిన మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై ఉక్కడం ప్రాంతానికి చెందిన శరవనన్ (27). ఒలింపస్ రామస్వామి నగర్‌కు చెందిన 20 సంవత్సరాల యువతిని గతకొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తర్వాత వారికి విభేదాలు ఏర్పడి ఇద్దరు విడిపోయారు.
ఈ క్రమంలో ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరముల తరువాత కుటుంబ సమస్యల కారణంగా ఆమె భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మాజీ ప్రియుడు తనను ప్రేమించమని వేధిస్తున్నట్లు తెలిసింది. దీనికి ఆ యువతి నిరాకరించడంతో శరవణన్ ఆమైపె దాడి చేస్తానంటూ బెదిరింపులతు పాల్పడ్డాడు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment