సాక్షి, చైన్నె: చెట్టినాడు గ్రూప్‌నకు చెందిన రూ.360 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. గత మూడు రోజులుగా చైన్నెలోని చెట్టినాడు గ్రూప్‌లో ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో నేలబొగ్గు తరలింపులో జరిగిన అక్రమాలు, విదేశాలలో పెట్టుబడుల వ్యవహారంలో లభించిన ఆధారాల మేరకు ఈడీ సోదాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చాయి.
అన్నాడీఎంకే హయాంలో విశాఖపట్నం నుంచి నేల బొగ్గు తరలింపు ఒప్పందాలను చెట్టినాడు గ్రూప్ పరిధిలోని సౌత్ ఇండియా కార్పొరేషన్‌కు అప్పగించినట్టు తేలింది. రూ.1,100 కోట్ల కాంట్రాక్టులో కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు, రూ.900 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో చెట్టినాడు గ్రూప్‌నకు చెందిన రూ. 360 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు నారాయణన్ మాట్లాడుతూ విద్యుత్ బోర్డులో రూ.1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని పట్టుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment