
సాక్షి, చైన్నె: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రేసులో చివరకు ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఒకరిని ఆ పదవి వరించనుంది. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ శైలేంద్రబాబు ఈనెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఈ పోస్టు భర్తీ నిమిత్తం సీనియర్ ఐపీఎస్‌లు 14 మందితో కూడిన జాబితాను ఢిల్లీలోని యూపీఎస్సీ సెలక్షన్ కమిటీకి రెండు నెలల క్రితం పంపించారు.
ఇందులో ముగ్గురి పేర్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించినట్టు సమాచారం. ఇందులో తమిళనాడు బ్యాచ్‌కు చెందిన ఢిల్లీ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై ఉన్న సంజయ్ అరోరా పేరు ప్రథమంగా వినబడుతోంది. అయితే, ఆయన మళ్లీ రాష్ట్రానికి వచ్చేందుకు మొగ్గు చూపనట్టు తెలిసింది. దీంతో ఈ జాబితాలో ఉన్న మిగిలిన ఇద్దరిలో ఒకరికి శాంతి భద్రతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఇద్దరిలో ఒకరు చైన్నె పోలీసు కమిషనర్ శంకర్‌జివ్వాల్, మరొకరు పోలీసు గృహ నిర్మాణ డైరెక్టర్‌గా ఉన్న ఏకే విశ్వనాథ్ ఉన్నారు. ఇందులో శంకర్‌జివ్వాల్‌కు అవకాశం ఎక్కువగా ఉండవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. సీఎం స్టాలిన్‌తో సన్నిహితంగా ఆయన ఉంటూ రావడం కలిసి వచ్చిన అంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment