
వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సీఐ జ్ఞానతి
తమిళనాడు: నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ జ్ఞానతి హెచ్చరించారు. తిరుత్తణిలోని చిత్తూరు రోడ్డు, చైన్నె బైపాస్, అరక్కోణం రోడ్డు సహా ప్రధాన మార్గాల్లో ట్రాపిక్ సీఐ జ్ఞానతి ఆధ్వర్యంలో ట్రాపిక్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించడంతో పాటు 18 ఏళ్లు లోబడిన వారు వాహనాలు నడపరాదని, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో సెల్‌ఫోన్లలో మాట్లాడడం నేరమని అందుకు జరిమానాతో పాటు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment