మహిళలు దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

మహిళలు దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాలు

Dec 25 2024 12:43 AM | Updated on Dec 25 2024 12:43 AM

మహిళలు దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాలు

మహిళలు దుస్తులు మార్చే గదిలో రహస్య కెమెరాలు

రామేశ్వరంలో ఇద్దరి అరెస్టు

సేలం : పుదుకోట్టై జిల్లాకు చెందిన భార్య, బిడ్డలతో ఓ వ్యక్తి కుటుంబంతో రామేశ్వరానికి స్వామి దర్శనం కోసం వచ్చారు. వారు మంగళవారం ఉదయం రామేశ్వరంలో అగ్ని తీర్థం సముద్రంతీరంలో పుణ్య స్నానాలు ఆచరించి తర్వాత కుటుంబంతో దుస్తులు మార్చుకోవడం కోసం టీ దుకాణానికి సమీపంలో ఉన్న దుస్తులు మార్చే గదికి వెళ్లారు. అక్కడ కుమార్తె దుస్తులు మార్చుకోవడానికి వెళ్లగా ఆ గదిలో సీసీ కెమెరా ఉండడం చూసి, దాన్ని తీసుకుని తన తండ్రికి అప్పగించింది. ఆయన వెంటనే ఈ విషయంగా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ గదిలో తనిఖీ చేయగా మొత్తం మూడు సీసీ కెమెరాలు ఉండడంతో దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ఆ నిఘా కెమెరాలను ఆన్‌లైన్‌ ద్వారా టీ దుకాణం యజమాని రాజేష్‌ కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు రాజేష్‌ అతనికి సహకరించిన టీ మాస్టర్‌ను అరెస్టు చేసి ఆలయ పోలీసు శాఖకు అప్పగించారు. ఈమేరకు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement