అన్నానగర్: బాలికపై లైంగిక దాడి కేసులో ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలోని సేదరాపట్టు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో కొన్ని రోజుల తర్వాత బాలిక ఇంటికి వచ్చింది. బాలిక ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వేలూరుకు చెందిన ఏలుమలై (32) అనే వ్యక్తి ఇన్‌న్‌స్ట్రాగామ్ ద్వారా బాలికతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం అతను చైన్నెలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఏలుమలైని చూసేందుకు చైన్నె వెళ్లింది. ఆ సమయంలో బాలికను తన ఇంట్లో ఉంచుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. తిరిగి బస్సులో పుదువైకి పంపించినట్లు బాలిక తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏలుమలైపై పోక్సో కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు.