![వికలా](/styles/webp/s3/article_images/2025/02/16/15cni35-300094_mr-1739650144-0.jpg.webp?itok=Pz4fc1r8)
వికలాంగుల సంక్షేమశాఖ అధికారి కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: రూ.10 లక్షల వ్యయంతో మరమ్మతు చేసి వికలాంగులు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని మంత్రి నాజర్ ప్రారంభించారు. అనంతరం వికలాంగుల జంటకు తాళి కోసం బంఽగారు పథకం కింద నగదు, బంగారు కాయిన్‌ను అందజేశారు. ఆ తరువాత 57 మంది వికలాంగులకు రూ.4,77,950 విలువ చేసే సంక్షేమ పథకాలను మంత్రి నాజర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి స్టాలిన్ వికలాంగుల సంక్షేమ శాఖను తన వద్దే ఉంచుకుని వారి అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. 2024–25లో వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.21.88 కోట్ల విలువ చేసే విద్యారుణాలు, స్వయం ఉపాధి రుణాలను జిల్లాకు కేటాయించారన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మంది వికలాంగులకు రూ.27.48 లక్షల విలువ చేసే స్కూటర్లు, 11 మంది వికలాంగుల జంటకు తాళి కోసం బంగారం పథకం కింద రూ.8.43 లక్షలు విలువ చేసే నగదు, బంగారు కాయిన్‌ను పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మేల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, గోవిందరాజన్, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉదయమలర్ పాల్గొన్నారు.
![వికలాంగుల సంక్షేమశాఖ అధికారి కార్యాలయం ప్రారంభం 1](/gallery_images/2025/02/16/15cni36-300094_mr-1739650144-1.jpg)
వికలాంగుల సంక్షేమశాఖ అధికారి కార్యాలయం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment