అద్భుత నటి సూర్యకాంతం
కొరుక్కుపేట: నవరసాలను తెరపై అలవోకగా ఒకేసారి పండించగల ఏకై క నటి సూర్యకాంతం అని సదస్సులో పాల్గొన్న వక్తలు కొనియాడారు. చైన్నె పట్టాభిరామ్‌లోని ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల, తెలుగుశాఖ, తెలుగు భాషా సమితి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి–యువ సంయుక్తంగా నిర్వహించిన ‘సూర్యకాంతం నటనా వైదుష్యంలో నవరసాలు‘ అనే అంశంపైన జాతీయ సదస్సు జరిగింది. ద్రావిడ వర్సిటీ కుప్పం నుంచి వచ్చిన డా.జేవీ సత్యవాణి సూర్యకాంతం వివిధ చిత్రాల్లో ఘట్టాలను ఉటంకిస్తూ సోదాహరణంగా విశ్లేషించిన తీరు ఆహూతులను ఆకట్టుకుంది. సూర్యకాంతం తనయుడు డా. అనంత పద్మనాభమూర్తి వారి అమ్మప్రేమను గుర్తు చేసుకున్నారు. ట్రిబ్యునల్ జడ్జి జయచంద్ర మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల్లో ఎక్కువగా సూర్యకాంతం ముఖ్యత్వాన్ని ఇచ్చారని అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు మాధవపెద్ది మూర్తి మాట్లాడుతూ సూర్యకాంతం అద్భుతంగా నవరసాలను, తన హావభావ ప్రకటనలతో అత్యంత సులభంగా పండించారని అన్నారు. రచయిత చిర్రావూరు మదన్‌మోహన్ సూర్యకాంతం నటించిన సినిమాలను గుదిగుచ్చి ఒక చక్కని కవితను వినిపించారు. రచయిత్రి జలంధర మాట్లాడుతూ ఆమె తెరపై అత్తరికాన్ని ప్రదర్శిస్తూ తెర వెనుక అమ్మదనాన్ని రుచి చూపించిన మేటినటి ఆమె అన్నారు. రచయిత్రి జోస్యుల ఉమ పేరడీ పాటలు ఆద్యంతం విద్యార్థులను కట్టిపడేశాయి. రోజారమణి, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ హాజరై ప్రసంగించడం విశేషంగా ఆకట్టుకుంది. కళాశాల కార్యదర్శి ఎం వెంకటేశ పెరుమాళ్ అతిథులను సత్కరించారు. కళాశాల ప్రధాన అధ్యాపకులు డా. జి కల్విక్కరసి, సంచాలకులు డా. ఎన్. రాజేంద్ర నాయుడు, కార్యక్రమ నిర్వహణ డా. తుమ్మపూడి కల్పన, తెలుగు శాఖాధ్యక్షుడు డా. సురేశ్డా. డి. ప్రమీల పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో కొనియాడిన వక్తలు
Comments
Please login to add a commentAdd a comment