హైకోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా

Published Thu, Feb 20 2025 9:08 AM | Last Updated on Thu, Feb 20 2025 9:03 AM

హైకోర

హైకోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా

కొరుక్కుపేట: పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ మద్రాసు హైకోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. దీంతో నిరసనలో పాల్గొన్న 100 మందికి పైగా న్యాయవాదులను పోలీసు అరెస్టు చేశారు. వివరాలు.. 2009 సంవత్సరంలో చైన్నె హైకోర్టులో న్యాయవాదులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామిపై కోడిగుడ్లు విసిరిన లాయర్లను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు గాయపడ్డారు. న్యాయవాదులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీని బ్లాక్‌ డేగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. చైన్నె హైకోర్టు అడ్వేకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోహన్‌ కృష్ణన్‌ నేతృత్వంలో న్యాయవాదులు చైన్నె హైకోర్టు ఆవరణలో ర్యాలీగా వెళ్లారు అనంతరం కోర్టు ఆవిన్‌ గేట్‌ ఎదుట బైటాయించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నుంగంబాక్కంలోని సీపీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పాదయాత్రకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 100 మందికి పైగా న్యాయవాదులను బస్సుల్లో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నిరసన కారణంగా ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులో సుమారు గంటపాటూ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

చైన్నె విమానాశ్రయంలో దోమల బెడద

కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో దోమల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికులు, విమాన సర్వీసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి పోటీగా చైన్నె విమానాశ్రయంలో దోమల బెదడ రోజురోజుకూ పెరుగుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డొమిస్టిక్‌ టెర్మినల్‌ –1 అరైవల్‌ ఏరియా, ఇంటర్నేషనల్‌ టర్మినల్‌ –2, డొమిస్టిక్‌ టర్మినల్‌ –4లోని మరొక ప్రాంతంలో దోమల ఎక్కువగా ప్రబలి ఉన్నాయి. గ్రౌండ్‌ ఫోర్‌లో ఎక్కువగా దోమలు ఉన్నాయి. దీనికి సుందరీకరణ కోసం పెట్టే క్రోటాన్స్‌ మొక్కలే దోమలు పెరగడానికి కారణం అని ప్రయాణికులు చెపుతున్నారు. కానీ ఇటీవల నెలలో ఒక్క రోజు కూడా దోమల స్ప్రే చేయడం లేదని చెపుతున్నారు. ప్రయాణికులు ఎయిర్‌ పోర్టు సోషల్‌ నెట్‌వర్క్‌లో చైన్నె విమానాశ్రయంలో దోమల బెదడ దీనిని నియంత్రించేందుకు తక్షణమే అత్యవసర చర్యలు తీసుకోవాలని నిరంతరం పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి అధికారులకు తలనొప్పిని తెచ్చిపెతోంది.

పూండిలో 2 టీఎంసీల నీటి నిల్వ

తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లలో గత ఏడాది కంటే ప్రస్తుతం రెండు టిఎంసీల నీరు అదనంగా నిల్వ వుందని అధికారులు వివరించారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లు పూండి సత్యమూర్తీ సాగర్‌ రిజర్వాయర్‌, పుళల్‌, చోళవరం, చెమరంబాక్కం, కన్నన్‌కోట తేరవాయి కండ్రిగ రిజర్వాయర్‌లు వున్నాయి. ఈ రిజర్వాయర్‌లో మొత్తం 11.757 టిఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో రిజర్వాయర్‌ల నీటి మట్టం అమాంతంగా పెరిగింది. చోళవరం మినహా మిగిలిన అన్ని రిజర్వాయర్‌లలో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రధాన రిజర్వాయర్‌ల నీటి మట్టం పూర్తీ స్థాయిలో నిల్వ వున్న క్రమంలో వేసవి నాటికి అంతరాయం లేకుండా తాగునీటిని విడుదల చేయవచ్చని అధికారులు వివరించారు. చైన్నెలో రోజుకు ఒక టీఎంసీ నీటిని శుద్ధీకరణ చేసి తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. బుధవారం సమాచారం మేరకు ప్రధాన రిజర్వాయర్‌లలో నీటి మట్టం 11 టిఎంసీల నీరు నిల్వ వుంది. గత ఏడాది ఇదే సమయంలో ప్రధాన రిజర్వాయర్‌ల నీటి మట్టం 9 టిఎంసీలు మాత్రమే. వీటిని పోల్చుకుంటే ఈ ఏడాది రెండు టీఎంసీల నీరు నిల్వ ఎక్కువగా వుందని అధికారులు వివరించారు.

పారాలింపిక్‌ ఛాంపియన్‌ షిప్‌

సాక్షి, చైన్నె: నెహ్రూ స్టేడియం వేదికగా 23వ జాతీయ స్థాయి పారాలింపిక్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. గురువారం కూడా జరగనున్న ఈ పోటీలలో 30 రాష్ట్రాలకు చెందిన 1,476 పారా అథ్లెట్స్‌ పాల్గొంటున్నారు. వివిధ పోటీలలో విజేతలకు క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ సభ్య కార్యదర్శి మేఘనాథరెడ్డిలు పతకాలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హైకోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా 
1
1/1

హైకోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement