లైంగిక దాడులను ఖండిస్తూ ఆందోళన
కొరుక్కుపేట: రాష్ట్రంలో లైంగిక దాడులు పేట్రేగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నాడీఎంకే నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం చైన్నెలోని నుంగంపాక్కం వల్లువర్ కోట్టం వద్ద అన్నాడీఎంకే విద్యార్థి సంఘం తరఫున ఆందోళన కార్యక్రమం జరిగింది. అన్నాడిఎంకే మాజీ మంత్రి పి.వలర్మతి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో విద్యార్థి సంఘం కార్యదర్శి సింగై రామచంద్రన్‌నాయకత్వం వహించారు. అన్నాడీఎంకే విద్యార్థి బృందం రాష్ట్ర ఉప కార్యదర్శి వకీల్ ఎ.పళని, మాజీ ఎంఎల్‌ఏ పురసాయి వీఎస్. బాబు, ప్రాంతీయ కార్యదర్శులు వేటెల కె.మారిముత్తు, పద్మేడు డి.సారథి, కె.సి. గోర్డాన్ ఎం. చంద్రశేఖర్, మహ్మద్ ఇంతియాజ్, న్యాయవాది ఇస్మాయిల్, బందరు బయస్, సేతుపట్టు దక్షిణ చైన్నె సౌత్ (తూర్పు) జిల్లా విద్యార్థి సంఘం కార్యదర్శి ఎం. రామలింగం, ఎం.జి.ఆర్. యువజన విభాగం జాయింట్ సెక్రటరీ డా.సునీల్, మాజీ ఎంపీలు ఆందోళనలో పాల్గొని కళ్లకు నళ్ల గంతలు కట్టుకుని నినాదాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులపై చర్యలు తీసుకోకుండా చేతకాని వారిలా ఈ ప్రభుత్వం పాలిస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment