తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి
వేలూరు: రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ బాబు అన్నారు. వేలూరు ఏలగిరి భవనం ఆవరణ సమీపంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్లాకుల్లోను ఇప్పటికే తాగునీటి సమస్యపై వివరాలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు నీటి కోసం ఎక్కడా ఆందోళనలు చేయకుండా వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరు జిల్లాలో ప్రతి సంవత్సరం వేసవిలో ఎండ తీవ్రత అధికంగా రానున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరా చేసే బోర్లు, బావులు, ట్యాంకులను ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సంప్రదించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జెడ్పీ నిధులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జెడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment